నౌషేర్వా సర్షియాదేశుపు చక్రవర్తి. ఆయన న్యాయపరిపాలనకు ప్రిసిద్ది పోందాడు. ధానధర్మాలు ఎక్కువగా చేసేవాడు. ఓ రోజు ఆయన మంత్రితో షికారుకు వెళ్లాడు. ఓ తోటలో ఓ ముసలాడు. ఖర్జూరం మొక్కలు నాటుతుండటం చూశాడు. చక్రవర్తి ఆ పండు ముసలి వద్దకు వెళ్లి ‘ నీవు తోటమాలివా, లేక యజమానివా ?’ అని అడిగాడు. ‘‘ నేను ఎవరికిందా పని చేయడం లేదు, ఈ తోట మా తాతముత్తాతలు నాటింది.’’ – మాలి వినయంగా బదులిచ్చాడు. పాదుషా- ‘‘ నీవు ఈ ఖర్జూరం మొక్కలు నాటుతున్నావు. ఇవి చెట్లయి, చెట్లు పెరిగి పెద్దదయి. ఇరవైఏళ్లు అయ్యేదాకా పళ్లనివ్వదు. ఇది అందరికీ తెలిసిన సంగతే. ముసలి తోటమాలి చక్రవర్తి తో ఇలా అన్నాడు.- ‘‘ మా తాత ముత్తాతలు నాటిన చెట్ల పళ్లు నేనింతవరకు చాలా తిన్నాను. అందువల్ల నా తర్వాత తరాతల వాళ్లు తినేందుకని నేను మొక్కలు నాటాలి. తాను పళ్లు తినడానికే చెట్లు నాటడం స్వార్థం’’. చక్రవర్తి తోటమాలి జవాబు విని చాలా సంతోషించాడు. అతనికి బహుమతిగా రెండు బంగారు నాణేలు ఇచ్చాడు. నీతి : పరుల కోసం పాటుపడితే పుణ్యం దక్కుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: