జుట్టు తెల్లబడడం అనేది ప్రస్తుతం రోజులలో అందరికీ సర్వసాధారణంగా వేధించే సమస్యగా మారిపోయింది. పూర్వపు రోజుల్లో తెల్ల జుట్టు కనిపిస్తే చాలు ముసలి వాళ్లు అయిపోయారని ఆటపట్టించేవారు. అయితే ఇప్పుడు ఈ సమస్య మహిళలకు పురుషులు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని ఇబ్బంది కలిగిస్తోంది. అయితే ఇలా తెల్ల జుట్టు కనిపించకుండా ఉండేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.. ముఖ్యంగా జుట్టుకు రంగు వేయడం లేదంటే తెల్ల వెంట్రుకలను తీసి వేయడం లాంటివి చేస్తూ ఉంటాము. అయితే ఇలా తెల్ల వెంట్రుకలు కనిపించడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.


కొంతమంది వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం సాధారణంగా వెంట్రుకలలో మొలనిన్  అనే పదార్థం ఉంటుంది అది తక్కువగా ఉంటే తెల్లగా ఎక్కువగా ఉంటే నల్లగా కనిపిస్తూ ఉంటాయి వెంట్రుకలు. చర్మం లోని మెలనిన్ ఉంటుంది. వయసు పైబడిన వారిలో సర్వసాధారణంగా తెల్ల వెంట్రుకలు వస్తాయి కానీ వయసుతో సంబంధం లేకుండా యుక్త వయసులోనే తెల్ల జుట్టు సమస్య ఉందంటే వారి జీవన శైలిలో అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా విటమిన్ బి12 విటమిన్ డి లోపం వల్ల మెలనిన్ తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అంతే కాకుండా థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి, ధూమపానం వంటి కారణాల వల్ల కూడా జుట్టు నేరుస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే చాలామంది తెల్ల వెంట్రుకలను తీసి వేస్తూ ఉంటారు. ఇలా తీయడం వల్ల మెలనిన్ ఇతర వెంట్రుకలకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. దీంతో వెంట్రుకలు తెలుపు రంగులోకి మారుతాయి అందుచేతనే అలా నేరీసిన వెంట్రుకలను లాగడం చేయకూడదు. అంతేకాకుండా పదే పదే తెల్ల జుట్టును తీసివేయడం వల్ల అక్కడ మచ్చలు ఏర్పడడమే కాకుండా జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుందట. ఇక అలా చేస్తూనే ఉంటే రాబోయే రోజులలో జుట్టు పెరగకపోవడం వంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: