వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఇందులో ఉండే అల్లిసిన్ దాని సుగుణాలకు కారణం అవుతుంది. అలాగే భాస్వరం, జింక్, పొటాషియం ఇంకా మెగ్నీషియం వంటి ఖనిజాలు వీటిలో చాలా పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో పెద్ద మొత్తంలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్ ఇంకా అలాగే థయామిన్ ఉన్నాయి. ఇది సుగంధ రుచితో పాటు, వెల్లుల్లి  శరీరానికి అసాధారణమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని ఎన్నో అధ్యయనాలు సూచిస్తున్నాయి. దానిలోని ఉన్న బయోయాక్టివ్ అణువులు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. ఇక వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అలాగే వెల్లుల్లి హృదయ నాళ ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది.ఈ వెల్లుల్లిని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా అలాగే కడుపులో హానికరమైన బ్యాక్టిరియా పెరగకుండా కూడా చేస్తుంది.ఇక ఈ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు ఇంకా అలాగే ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే ప్రతి రోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


అలాగే వెల్లుల్లి వాడడం వల్ల అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.వెల్లుల్లి నూనె రాసుకోవడం ఆర్థరైటిస్ ప్రభావాల నుంచి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఈ వెల్లుల్లి నూనెలో యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది.అలాగే వెల్లుల్లిలో వైరస్‌లు, బ్యాక్టీరియా ఇంకా శిలీంధ్రాల నుంచి రక్షించగల సామర్థ్యం ఉంటుంది. ఇక ఈ వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు ఇంకా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ముఖంపై మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మీ ముఖాన్ని బాగా శుభ్రపరుస్తాయి.ఈ వెల్లుల్లి ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అలాగే కడుపులో మంటతో పోరాడుతుంది. ఇంకా అలాగే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. వెల్లుల్లిలో 20 కంటే ఎక్కువ పాలీఫెనోలిక్ భాగాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇది ఫ్లేవనాయిడ్లు ఇంకా పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లలో చాలా ఎక్కువగా ఉండే ఆహారాలలో ఒకటిగా నిలిచింది.ఇక ఈ వెల్లుల్లి తరచూ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల లోని జిగటను కూడా తగ్గిస్తుంది. అందువల్ల రక్తం గడ్డ కట్టే సమస్య నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: