తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు పెద్దలు. అలా అనడం వెనుక పెద్ద చాలా అర్దం ఉంది. మనిషి అన్న తర్వాత భావోద్వేగాలు సర్వసాధారణం... ప్రేమ , జాలి, అసూయ వంటి వాటితో పాటుగా... మనకు నచ్చని పనులు చేసినపుడు, జరిగినపుడు ఎదుటి వారిపై కోపం వస్తుంది. విషయం పెద్దది కనుక అయితే కోపం కనుక మితి మీరి కట్టలు తెంచుకుంటే ఆ కాలంలో కొన్ని సార్లు తీర్చలేని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చాలానే చూసి ఉంటాం.. విని వుంటాం. మనం కనుక శాంతంగా ఉండటానికి అలవాటు పడితే కోపం అనేది వచ్చినా దాన్ని కంట్రోల్ లో పెట్టుకో గలము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎంతటి కోపాన్ని అయినా అదుపులో ఉంచుకోవచ్చు.

అలాగే కొన్నిసార్లు కోపంలో మన ప్రియమైన వారిపై కూడా కోప్పడి వారిని బాదిస్తాము. అపుడు వారికి కూడా మనపై కోపం వస్తుంది, బాధ కలుగుతుంది.  అయితే వారి బాధను పోగొట్టి, కోపాన్ని తగ్గించి మళ్ళీ మనతో మామూలుగా ఉండాలంటే ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే సరి.

ముందుగా మీ కోపాన్ని మితి మీరకుండా ఉండేలా చూసుకోండి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు అన్న సామెత ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకుంటే ఆ పొరపాటు జరగదు.

1. ఇక మన ప్రియమైన వారి కోపాన్ని చల్లార్చడానికి... వారిని భుజ్జగిస్తూ మాట్లాడాలి. వారిని పొగుడుతూ, కాస్త బ్రతిమలాడుతూ వారి కోపం చల్లారే వరకు మాట్లాడాలి.

2. వారు కోపంలో ఒకటి రెండు మాటలు మనల్ని బాధించేలా అన్నా సర్దుకుని మళ్ళీ తిరిగి వారిని బుజ్జగించాలి. అపుడే వారికి తమపై మనకు వున్న మమకారం అర్దం అవుతుంది.
 
3. అలాగే వారికి నచ్చిన వస్తువులను బహూకరించి ప్రేమగా మాట్లాడాలి.
 
4. వారిని కాసేపు అలా షికారుకు తీసుకెళ్ళి వారికి నచ్చింది తినిపించినా వారి కోపాన్ని తగ్గించవచ్చు.

5. అలా కాకుండా మీరు ఆ వ్యక్తితో కొంచెం సేపు వారికీ నచ్చిన అంశాలను ముచ్చటించినా వారి కోపాన్ని తగ్గించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: