ఈ కాలంలో పిల్లలు తలకి నూనె రాయడం మానేశారు. ఈ కాలంలో పిల్లలు స్టైలిష్ గా ఉంటూ రకరకాల హెయిర్ స్టైల్ లను వేస్తూ తలకి నూనె అనేదే రాయడం లేదు. నెల రోజుల పాటు నూనె రాయకపోతే వచ్చే సమస్యలు ఇవే. జుట్టు సంరక్షణ కోసం జుట్టుకు నూనె రాయడం తప్పనిసరి. అయితే చాలామంది నూనె రాయాడాన్ని స్కిప్ చేస్తున్నారు. ఇలా నూనె రాయకుండా ఉండడం వల్ల జరిగే నష్టాలు చాలానే ఉన్నాయి. నెల రోజులపాటు నూనె రాయకుండా ఉండడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. జుట్టులో తేమ తగ్గుతుంది. జుట్టు పెళుసుగా తయారవుతుంది. రెగ్యులర్గా తలకు నూనె అప్లై చేస్తే జుట్టు పెరుగుతుంది. నెలపాటు నూనె అప్లై చేయకపోతే జుట్టు సహజ మెరుపు కోల్పోతుంది.

తలకు నూనె అప్లై చేయకపోవడం వల్ల కుదుళ్ళు బలహీనంగా మారుతుంది. నూనెలో ఉండే కొవ్వు అమ్లాలు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు పోషణను అందిస్తాయి. నూనె రాయకపోవడం వల్ల జుట్టు కుదుళ్ళ దెబ్బతింటాయి. నూనె రాయకపోవడం వల్ల జుట్టు చిక్కులు పడుతుంది. దువ్వడం చాలా కష్టంగా మారుతుంది. జుట్టును స్టైల్ చేయలేం. నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టుకు యువి కిరణాలు, పొల్యూషన్ నుంచి తీవ్రనాష్టం కలుగుతుంది. నూనె రాసుకుంటే ప్రమాదం తీవ్రత తగ్గుతుంది. నూనె రాసుకోవడం ఇష్టం లేకపోతే మార్కెట్లో నూనెతో యాడ్ చేసిన షాంపూలు చాలా దొరుకుతుంటాయి.

 కండీషనర్ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తలకు సరైన పోషణ అందకపోవడం వల్ల జుట్టు మొద్దుబారిపోతుంది. వేరే ప్రాణం లేని మొక్కల వలె, తలపై జుట్టు బలహీనమై పట్టును కోల్పోయి ఊడిపోతుంది. నెల రోజులు నూనె రాయకపోతే, నాణ్యమైన జుట్టు క్రమంగా తగ్గిపోతుంది. తలకు రక్త ప్రసరణ బాగా జరగడం కోసం నూనె మసాజ్ అవసరం. నెలల పాటు నూనె రాయకపోతే, రక్త ప్రసరణ మందగించి, జుట్టు ముందే తెల్లబడ్డే ప్రమాదం పెరుగుతుంది. నూనె వల్ల జుట్టు మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఒక నెల పాటు నూనె రాయకపోతే, ఈ పోషణ తగ్గి జుట్టు వేర్ల స్థిరత్వం తగ్గిపోతుంది, దాంతో జుట్టు ఊడడం, లేత జుట్టు రావడం జరుగుతుంది. నూనె రాస్తే తలలో తాపం తగ్గి, ఆరోగ్యంగా జుట్టు పెరుగుతుంది. నెల రోజులపాటు నూనె రాయకపోతే, జుట్టు పెరుగుదల మందగిస్తుంది లేదా ఆగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: