మంత్రి పదవి ఆశించే ఎమ్మెల్యేల్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా ఒకరని చెప్పొచ్చు. మొదట విడతలోనే ఛాన్స్ వస్తుందని బాలరాజు అనుకున్నారు...కానీ సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా పదవి మిస్ అయింది. అయితే ఈ సారి బాలరాజుకు పదవి గ్యారెంటీ అని పశ్చిమ గోదావరి రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

ఎందుకంటే ఈ సారి మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి జగన్...కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే తమ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు పదవులు కోల్పోనున్నారు. ఆళ్ల నాని, రంగనాథరాజు, తానేటి వనితలు క్యాబినెట్ నుంచి సైడ్ అవ్వడం గ్యారెంటీ...దీంతో ఎస్సీ కోటాలో వనిత సైడ్ అయితే...అదే కోటాలో బాలరాజుకు ఛాన్స్ రావొచ్చు.

పైగా బాలరాజు....వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడు. బాలరాజు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోలవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా సత్తా చాటారు.  వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌కు మద్ధతుగా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు. దీంతో 2012లో ఉపఎన్నికలు రాగా, ఆ ఎన్నికల్లో బాలరాజు వైసీపీ తరుపున నిలబడి భారీ విజయాన్ని దక్కించుకున్నారు.


2014 ఓడిపోయిన బాలరాజు...2019 ఎన్నికల్లో దాదాపు 42 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజుకు....పోలవరంపై మంచి పట్టు ఉంది. ఎమ్మెల్యేగా కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారు...అక్కడి ప్రజలకు బాగానే అందుబాటులోనే ఉంటున్నారు...ప్రభుత్వం తరుపున జరిగే...సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పోలవరంలో జరుగుతున్నాయి.

 
నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ  రోడ్లు పరిస్తితి బాగోలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముంపు బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరముంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సరైన రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రాజకీయంగా బాలరాజు స్ట్రాంగ్‌గా ఉన్నారు...స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. టి‌డి‌పి వీక్‌గానే కనిపిస్తోంది. ఒకవేళ బాలరాజుకు మంత్రి పదవి వస్తే..మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: