రక్షాబంధన్ సోదర సోదరీమణుల పండుగ.. అక్కా చెల్లి తమ అన్నదమ్ముల చేతులకు రాఖీలు కట్టి ఎప్పటికీ తమకి రక్షగా ఉండాలి అని తమ అన్నదమ్ములు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అని సోదరీమణులు రాఖీ కడుతూ కోరుకుంటారు.అలాగే తమ చెల్లెళ్లు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అన్నదమ్ములు దీవిస్తూ ఎల్లవేళలా రక్షణగా ఉంటాం అని మాట ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి రక్షాబంధన్ స్పెషల్ గా మనం ఈరోజు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా మెగా ఫ్యామిలీ నుండి చూస్తే.. రామ్ చరణ్ హీరోగా రాణిస్తుంటే రామ్ చరణ్ సోదరి సుస్మిత నిర్మాతగా రాణిస్తోంది. 

అలాగే వరుణ్ తేజ్ హీరోగా చేస్తే నిహారిక హీరోయిన్ గా చేస్తూనే నిర్మాతగా కూడా మారింది. ఇక ఘట్టమనేని మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే ఆయన సోదరి మంజుల కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఏఎన్ఆర్ మనవడు మనవరాలు అయినటువంటి యార్లగడ్డ సుమంత్ సుప్రియ ఇద్దరు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు.సుమంత్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉంటే సుప్రియ ఓ సినిమాలో హీరోయిన్గా చేసి ప్రస్తుతం నిర్మాతగా సెటిల్ అయింది.

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఆయన వారసులుగా తన ముగ్గురు పిల్లలు వచ్చారు. అలా మనోజ్,విష్ణు ఇద్దరు హీరోలుగా చేయగా మంచు లక్ష్మి కూడా సినిమాల్లో హీరోయిన్ గా విలన్ గా పలు టాక్ షో స్ అంటూ ఇండస్ట్రీలోనే రాణిస్తోంది. ఇక వీళ్లే కాకుండా బాలీవుడ్ లో కూడా రన్బీర్ కపూర్ ఆయన సోదరి రిద్దిమాకాపూర్ సోనాక్షి సిన్హా ఆమె సోదరుడు లవ్ సిన్హా, ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ సోహా అలీ ఖాన్,అనన్య పాండే అహాన్ పాండే అలాగే రన్బీర్ కపూర్ సొంత సోదరి రిద్ధిమా కపూర్  కాకుండా కరీనాకపూర్, కరిష్మా కపూర్లు కూడా రన్బీర్ కి సోదరీమణులే.వీళ్లు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: