శర్వానంద్‌ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ మూవీ ఫంక్షన్ లో ఆఫంక్షన్ కు అతిదిదిగా వచ్చిన అల్లుఅర్జున్ ను ఆకాశానికి ఎత్తేస్తూ శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. ఈమూవీ హిట్ కొడుతుంది అన్న తన నమ్మకాన్ని వివరిస్తూ ఇండస్ట్రీలో అందరూ బన్నీ బాబుది గోల్డెన్‌ హ్యాండ్‌ అంటున్నారని అతడి గోల్డెన్ టచ్ తో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారినట్లే తాను కూడ అల్లు అర్జున్ గోల్డెన్ టచ్ తో క్రేజీ హీరోగా మారుతాను అన్న నమ్మకం తనకి ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. 
ప్లాప్ డైరెక్టర్‌తో ఎందుకు? అన్నారు
ఇదే సందర్భంలో శర్వానంద్ తన ప్రశంసలు కొనసాగిస్తూ తాను  ప్రస్తుతం పెద్ద హీరోని కాకపోయినా తన సినిమా ఫంక్షన్ కు అతిథిగా వచ్చి బన్నీ  తన మంచి మనసు చాటుకున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు చాలా మంది హీరోలకు బన్నీ ఇన్‌స్పిరేషన్‌ అంటూ మంచి సినిమాలు చాలా డిఫెరెంట్ గా చేస్తాడు కాబట్టే అల్లు అర్జున్ తమకంటే ఒక స్టెప్ పైన ఉంటాడు అంటూ కామెంట్స్ చేసాడు శర్వానంద్.
మా బ్లడ్ తాగేశాడు
అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో 100 కి 150 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టె ఏకైక టాప్ యంగ్ హీరో అల్లు అర్జున్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు. చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా మంచి సినిమా వస్తే ఆసినిమా హీరోకు దర్శకుడికి తొలి అప్రిషియేషన్‌ ఫోన్‌ అల్లు అర్జున్ నుంచి వస్తుంది అంటూ స్టైలిస్ట్ స్టార్ ను ఆకాశానికి ఎత్తేశాడు శర్వ. 
సాయి పల్లవి గురించి మీరు విన్నదంతా సోది
ఇదే సందర్భంలో ఈమూవీలో కొత్త శర్వాను చూడ బోతున్నారు అన్న సంకేంతాలు ఇస్తూ  ఈమూవీలో తనతో కలిసి నటించిన సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ అని అంటూ ఆమె గురించి చాలా రూమర్స్ వచ్చిన విషయాన్ని వివరిస్తూ సాయి పల్లవి లాంటి  డేడికెటేడ్‌ యాక్ట్రెస్ ఇండస్ట్రీలో మరెవ్వరు ఉండరు అంటూ ఈసినిమా వల్ల సాయి పల్లవి లాంటి మంచి ఫ్రెండ్‌ దొరికింది అంటూ సాయి పల్లవితో మరిన్ని సినిమాలు చేసే సంకేతాలు ఇస్తున్నాడు శర్వానంద్. దీనితో ఈసినిమాకు అల్లు అర్జున్ గోల్డెన్ హ్యాండ్ ఎంతవరకు శర్వానంద్ కు కలిసి వస్తుందో ఈ వీకెండ్ కు తేలిపోతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: