వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరు తెలుగు ఇండస్ట్రీ లోనే ఓ పెద్ద సంచలం. ఆమె పేరు చెబితేనే గుండె గుబేల్ అంటుంది చాలా మంది సినీ కళాకారులకు. కాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగమ్మాయిలకు అన్యాయం జరుగుతుందంటూ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసింది శ్రీ రెడ్డి. ఆ తర్వాత శ్రీ రెడ్డి కి తెలుగు లో సినీ అవకాశాలు పూర్తిగా సన్నగిలాయి. 


దీనితో ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై కి మకాం మార్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇక్కడి వారని మాత్రం వదిలిపెట్టకుండా వారిపై అడపాదడపా నోరు పారేసుకోవడం శ్రీ రెడ్డి కి బాగా అలవాటయింది. ఇప్పటికే ప్రముఖ తెలుగు నటులను... మెగా ఫ్యామిలీ తో.. సహా టార్గెట్ చేస్తూ పెద్ద దుమారమే రేపింది ఈ హాట్ తార. అయితే ఎప్పుడూ టార్గెట్ చేసే ఆమె పైనే బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ భానుశ్రీ తో టార్గెట్ చేయించాడు ఈ ఏడు చేపల కథ దర్శకుడు ఎస్ జె చైతన్య. 


అది ఎలాగంటే... నిన్న అంటే నవంబర్ 7న ఏడు చేపల కథ విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం లో హీరో రవికి బ్లడ్ అవసరం అవుతుంది.... దానితో భానుశ్రీ రక్తదానం చేసే వారి కోసం చాలా మందికి ఫోన్లు చేయగా..... ఒకడు ఫోన్ లిఫ్ట్ చేసి.. 'బ్లడ్ ఇస్తా. మరి నాకేం ఇస్తావ్?.. వస్తావా' అంటూ నీచంగా మాట్లాడతాడు. భానుశ్రీ కూడా 'సరే వస్తాను రా' అని చెప్పి జుట్టు విరబూసుకుని.. నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుని వాడి ఇంటిముందుకు వెళ్లి బట్టలు విప్పడానికి సిద్ధమవుతుంది.
అయితే ఆ సమయంలో మీడియా వాళ్ళు అక్కడే ఉండడంతో .. బట్టలు విప్పబోతున్న భానుశ్రీ ని పలురకాల భంగిమలలో ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు. అచ్చం ఇలాగే ఒకప్పుడు శ్రీ రెడ్డి కోసం మీడియా చేసిందే ఇదే. శ్రీ రెడ్డి కి నిజంగా జరిగిన ఓ సంఘటననే.. ఒక సీన్ లా క్రియేట్ చేసి 'ఏడు చేపల కథ' లో బిగ్ బాస్ భానుశ్రీ తో చేయించాడు దర్శకుడు ఎస్ జె చైతన్య.


ఇక సినిమా సీన్ ని కంటిన్యూ చేస్తే... ఫొటోస్ తీస్తున్నా మీడియా వాళ్ళు.. 'మీరు పెద్ద బొట్టు పెట్టుకుంటారా.. జుట్టు ఇలాగే విరబూసుకుంటారా', అంటూ భానుశ్రీ ని అడగడంతో.. 'ఈ బొట్టు, జుట్టు పెద్ద ఫేమస్',  అని చెప్తుంది. ఈ సన్నివేశం అంతా చూస్తుంటే దర్శకుడు ఎస్ జె చైతన్య కావాలనే శ్రీ రెడ్డి ని టార్గెట్ చేశాడని అర్ధం అవుతుంది. దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ఇక.


మరింత సమాచారం తెలుసుకోండి: