పెద్ద పెద్ద కళ్ళు.. ఉంగరాల జుట్టు.. నిండు మొహంతో అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళీ బ్యూటీ నటన అద్భుతం.. ఆమె ఏదైనా ఒక రోల్ చేసింది అంటే ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది.. 

 

నిజానికి ఆ క్యారెక్టర్ కి పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినా సరే.. ఆ పాత్రకు తగ్గ న్యాయం నిత్య మీనన్ చేస్తుంది.. చెప్పాలంటే ఆమె నటన వల్లే చాలా సినిమాల్లో పాత్రలకు రెక్కలు వచ్చాయి.. హీరోయిన్ అంటే ఏదో నటించడం.. నాలుగు పాటల్లో కనిపించడం అనేది కాకుండా ఆమె నటన మంచి చెయ్యడం లో నిత్య మీనన్ తరువాతే ఎవరైనా.. 

 

ఇలా అన్ని పాత్రల్లో అద్భుతంగా నటించే బ్యూటీకి నటన పరంగా ఎంత పట్టు ఉందో.. అంతే పొగరు కూడా ఉందట.. నిత్య మీనన్ పొగరుబోతు నటి అని చేరన్ అనే ఓ తమిళ దర్శకుడు అన్నారు. నిత్య  మీనన్, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా ఓ తమిళ చిత్రంలో నటించారు.. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన చేరన్సినిమా ఫస్ట్ లుక్ కార్యక్రమంలో ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

అతను తీసిన ఆ చిత్రానికి హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నిత్య  మీనన్ గురించి తెలిసింది అని.. కథ విన్న ఆమె వారి చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది అని అయితే ఆమె చాలా మంచి నటి అని.. పాత్రలో ఇట్టే ఒదిగిపోతుందని ప్రశంసించారు. అంతేకాదు ఆమెలో ఎంత మంచి నటన ఉందొ పొగరు కూడా అంతే ఉంది అని.. ఆమె పొగరుబోతు బ్యూటీ అని అతను సరదాగా అన్నాడు. 

 

అయితే అతను సరదాగా అన్నప్పటికీ.. చాలామంది దర్శక నిర్మాతలు ఆమె సెట్స్ లో ఉండే తీరును భరించలేకపోయేవారట.. ఆమెను హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నామా అని బాధపడేవారట.. కానీ ఆ విషయాలను బయట చెప్పకుండా ఉండేవారట దర్శకనిర్మాతలు.. అందుకే ఆమె నటన బాగున్నా.. ఆమె పొగరు కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వటం లేదట!

మరింత సమాచారం తెలుసుకోండి: