నితిన్ అందరికీ తెలిసిన టాలీవుడ్ హీరో.  అయితే టాలీవుడ్ లో హీరోలు ఉండగా నితిన్ ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా.. నేను చెప్పేది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. జాగ్రత్తగా ప్రతి పాయింట్ చదవండి.

 నితిన్ తన సినీ ప్రయాణాన్ని జయం తో మొదలు పెట్టాడు. తన మొదటి సినిమానే పెద్ద దర్శకుడితో పని చేశాడు. జయం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.జయం సినిమాని  వివిధ భాషల్లోకి కూడా అనువాదం చేశారు..  నితిన్, సదా జంటగా గోపీచంద్ విలన్ గా చేసిన జయం సినిమా కి తేజ దర్శకుడు.

 తొలి సినిమాతోనే హిట్ కొట్టిన నితిన్ ఆ తర్వాత దిల్ సినిమా చేశాడు.. మనమిప్పుడు పిలిచే దిల్ రాజు తొలి సినిమా కూడా ఇదే తన తొలి చిత్రంతోనే నిర్మాత రాజు తన ఇంటి పేరు దిల్ రాజు గా మారిపోయింది..నితిన్, స్నేహ శర్మ జంటగా ప్రకాష్ రాజ్ విలన్ గా చేసిన ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకుడు .నిర్మాత రాజు అదేనండి దిల్ రాజు..

మనం చూస్తున్న ఢీ షోలో న్యాయనిర్ణేతలుగా చేసిన సదా ఇప్పుడు చేస్తున్న ప్రియమణి ఒకప్పుడు నితిన్ పక్కన హీరోయిన్లు గా చేసిన వారే ఎలా అంటారా..
బిగ్ బాస్  సీజన్ 4 ఫేమ్  అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో టక్కరి అనే ఒక సినిమా చేశారు ఇందులో నితిన్ సదా జంటగా నటించారు.. కానీ  ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది ఇక నితిన్ హీరోగా ద్రోణ అనే సినిమా చేశారు ఇందులో హీరోయిన్ గా నితిన్ పక్కన ప్రియమణి నటించింది సరిపోయిందిగా ..
 
అలాగే మొన్న పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కూడా నితిన్ తో నటించింది.. అది కూడా కాజోల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త లో నటించింది .. దీన్ని బట్టి చూస్తే అది ఎంత పాత సినిమానో  అర్థమవుతుంది.. బహుశా నేను చెప్పే వరకు మీకు కూడా ఆ సినిమా పేరు  గుర్తు ఉండకపోవచ్చు.. నితిన్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా ఆటాడిస్తా సినిమాలో నటించారు.. అందులో నేను కొట్టలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు.. కానీ అది చెప్పిన నటుడు ఇప్పుడు మన ముందు లేరు.

అలాగే సన్నని నడుము సుందరి ఇలియానా కూడా నితిన్ తో రెచ్చిపో అనే సినిమా లో నటించింది ..  అంతేకాదు బ్యూటిఫుల్ హన్సికా మోత్వాని కూడా నితిన్ తో సీతారాముల కళ్యాణం లంకలో అనే సినిమా లో నటించింది ..

ప్రముఖ దర్శకులతో చేసిన నితిన్
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నితిన్ హీరోగా చేశారు.. ఆ సినిమా పేరు అల్లరి బుల్లోడు.. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా హీరోయిన్ త్రిష అండి.. త్రిష ఏంటి నితిన్ పక్కన అని అనుకోవద్దు నితిన్ మరియు త్రిష కలిసి దర్శకేంద్రుడు దర్శకత్వంలో చేశారు.

అలాగే దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో నితిన్ హీరోగా చేశాడు.. రబ్బీ క్రీడా నేపథ్యంలో వచ్చిన సై సినిమా లో చేశారు.. ఇందులో రబ్బీ కోచ్ గా  రాజీవ్ కనకాల బాగా నటించారు.మరో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హార్ట్ ఎటాక్ అనే సినిమా వచ్చింది.. ఇందులో నితిన్, ఆదా శర్మ జంటగా నటించారు..అలా సినిమాలు చేస్తున్న నితిన్ నిత్య మీనన్ తో కలిసి గుండె జారీ గల్లంతైయింది అనే సినిమాలో నటించారు.. మేఘ ఆకాష్ తో లై లో నటించారు.  రాశి కన్నా తో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేశారు..

ఇవే కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేశారు...అఆ సినిమాలో  నటించారు ఈ సినిమాలో సమంతాని మనం ఒక డిఫరెంట్ రోల్ లో చూడొచ్చు.. లేటెస్ట్ గా వచ్చిన హీరోయిన్ రష్మికా మండన్న తోనూ భీష్మ అనే సినిమా చేశారు నితిన్సినిమా వేసవిలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది..

 అలాగే నితిన్ రాంగోపాల్ వర్మ తోను ఒక సినిమా చేశారు.. అది రిలీజ్ అయిందో కాలేదో తెలియదు ఆ సినిమా పేరు మాత్రం అడవి.. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లోను మరియు 24 లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ తీసిన విక్రమ్ కె కుమార్ గారి దర్శకత్వంలోనూ నితిన్ చేశాడు ..

ఇలా వరుస హీరోయిన్లతో మరియు ప్రముఖ దర్శకులతో ను సినిమాలు చేశాడు కాబట్టే నితిన్ చాలా ప్రత్యేకం అని అంటున్నాను.. ఇలాగే నితిన్ సినిమా కెరీర్ ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను...  

మరింత సమాచారం తెలుసుకోండి: