కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో  ఉన్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ దృష్టి తన తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అనే విషయం పై పడింది.మలయాళం లో విజయవంతం అయిన లుసిఫార్ రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిచబోతున్నారు.ఫ్రీ ప్రొడక్షన్ సంబంధించిన పనులు చురుగ్గా నే సాగుతున్నాయి.అంతేకాదు త్వరలోనే చిరంజీవి లుసిఫార్ షూటింగ్ కి జాయిన్ కానున్నాడని తెలుస్తోంది.ఇక ఇండ్రస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా టైటిల్ అప్ డేట్ గురించి చర్చ జరుగుతుంది.

ఇక ఆగస్టు సెకండ్ వీక్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. ఇక మెగాస్టార్ లుసిఫార్ షూటింగులో ఆగస్టు 12న జాయిన్ కానున్నట్లు మెగా కాంపౌండ్ నుండి సమాచారం.ఇప్పటికే రీమేక్ కోసం భారీ సెట్టింగ్ ని సెల్వరాజ్ ఆధ్వర్యంలో జరిగిందని.ఇక తాజాగా   టాలీవుడ్ లో ఈ సినిమాపై కొన్ని ఇంట్రస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతోంది.ఇక ఈ సినిమాకి పెట్టె టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కథ ప్రకారమే కాకుండా మెగాస్టార్ కి ఇమేజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని ఈ టైటిల్ ని ఫైనల్ చేసారట.

ఒరిజినల్ గా మొహన్ లాల్ పోషించిన స్టీఫెన్ పాత్రను మెగాస్టార్ పోషించాబోతున్నారు.ఈ పాత్ర మొదటి నుంచి చివరి వరకు గంభీరంగా ఉంటుంది.. కానీ మన తెలుగు లో మాత్రం మెగాస్టార్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా కేవలం మాతృక కథలోని ఆత్మను మాత్రం తీసుకొని చేస్తున్నారట.ఇక హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని టాక్. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ అంటేనే అదిరే స్టెప్పులు ఉండక తప్పదు.మలయాళం లో ఐటమ్ సాంగ్ తప్ప  తెలుగులో చిరు కు తగ్గట్టు పాటలు ఉంటాయట.మరి ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: