విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరించే నాని సినీ ఫీల్డ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి... విజయవంతమయ్యారు. ఆయన కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగులో స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హీరోగా చేయడం మాత్రమే కాకుండా నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ పై మూవీలను నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ లో మొదట వచ్చిన అ! చిత్రం విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. తన బ్యానర్ లో టాలెంట్ ఉన్న నూతన దర్శకులను ఇంట్రడ్యూస్ చేయాలనే గోల్ పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో అడవి శేష్ ను హీరోగా పెట్టి.. తెలుగులో విజయవంతమైన హిట్ సినిమాకు సీక్వెల్ గా హిట్ 2 సినిమాను రూపొందిస్తున్నాడు. అంతే కాకుండా మీట్ క్యూట్ అనే మరో వైవిధ్యభరితమైన సినిమాను కూడా ప్రకటించాడు. ఇలా నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా మారిపోతున్నాడు.


ప్రస్తుతం వాల్ పోస్టర్ సినిమా హీరో నాని సోదరి ఘంటా దీప్తిని డైరెక్టర్ గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేసింది. మీట్ క్యూట్ అనే వైవిద్యభరితమైన సినిమాను దీప్తి దర్శకత్వంలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. ఇందులో దాదాపు 12 మంది ప్రధాన పాత్రదారులు ఉండనున్నట్లు తెలుస్తోంది. పేరు మోసిన ఆరుగురు ఫీమేల్ యాక్టర్లు, ఆరుగురు మేల్ యాక్టర్లు నటిస్తున్నారని సమాచారం. నాగార్జున– నాని కాంబినేషన్ లో వచ్చిన దేవదాసు సినిమాలో నాగార్జున కు జోడీగా నటించిన ఆకాంక్ష సింగ్ కూడా ఈ ఆరుగురు ఫీమేల్ యాక్టర్లలో ఉన్నట్లు వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అనే సంగీత దర్శకుడు స్వరాలు సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: