2011లో విష్ణువర్థన్ దర్శకత్వంలో తెరకెక్కిన పంజా సినిమాలో హీరోగా పవన్ కల్యాణ్ నటించిన సంగతి విధితమే. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత బాణీలు సమకూర్చారు. ఈ మూవీ ఆడియో నవంబర్ 18 2011న రిలీజ్ అయింది. హైదరాబాద్ నగరంలో లాంఛనంగా విడుదల చేసిన పంజా పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులోని టైటిల్ ట్రాక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రొమాంటిక్ సాంగ్ 'ఎలా ఎలా' సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని 'వెయిరా  రా చెయ్యి వెయిరా  రా...' ఐటెమ్ సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ సలోని ఆలపించారు.




ముంబై ముద్దుగుమ్మ అంజలి లావానియా ఈ పాటలో తన అందాల ఆరబోతతో సెగలు పుట్టించింది. సాంగ్ మ్యూజిక్ కి తగ్గట్టుగా ఆమె తన బాడీ ని షేక్ చేస్తూ కుర్రకారుకి మతి పోగొట్టారు. శృంగార భరితమైన లిరిక్స్ కూడా ఈ పాటను మరింత హాట్ గా మార్చింది. అంజలి లావానియా తన తడి అందాలను చూపించేస్తూ కైపెక్కించింది. కొంటె చూపులతో సెక్సీ భంగిమలతో ఆమె తన తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. ఈ ఒక్క పాట లోనే కాదు సినిమాలో ఆమె క్లబ్ డాన్సర్ గా కీలక పాత్ర పోషించింది. గ్లామర్ డాల్ గా ఆమె ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. పంజాలో ఆమె ఉత్తమ నటనా చాతుర్యం కనబరిచి బెస్ట్ న్యూ కాన్ఫిడెంట్ ఫేస్ గా సినీ మా అవార్డును గెలుచుకుంది.



నిజానికి పంజా సినిమా తరువాత ఆమె మరేతర సినిమాలో నటించలేదు. ఆమె నటించిన మొదటి, ఆఖరి ఫిల్మ్ పవన్ కల్యాణ్‌దే కావడం విశేషం. అంజలి లావానియాకి యోగా అంటే చాలా ఇష్టం. మోడల్ గా చాలా కాలం రాణించిన తరువాత ఆమె యోగా సాధన చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమె లైఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: