తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఎక్కువగా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో బాగా పాపులర్ అయిన వాళ్ళను సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.అలా సోషల్ మీడియాలో పాపులర్ అయి.. బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చింది సిరి హన్మంత్.షార్ట్ ఫిల్మ్స్ నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సిరి.. ఆ తర్వాత వెబ్ సీరీస్ లు, సీరియల్స్ చేస్తూ వస్తోంది.యూట్యూబ్ లో తన ఛానెల్ లో వరుసగా వెబ్ సీరీస్ లు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఈ అమ్మడికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

యూట్యూబ్ స్టార్ సిరి హన్మంత్ కు మరో యూట్యూబ్ నటుడు శ్రీహాన్ తో ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది.వీరిద్దరూ కలిసి వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్నారు.కొద్ది రోజుల్లో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు.అయితే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో పెళ్లికి కాస్త బ్రేక్ పడింది.యూట్యూబ్ లోనూ జోడిగా నటించి నిజ జీవితంలోనూ జోడిగా మారబోతున్నారు.ఇక తాజాగా సిరి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.సిరి, శ్రీహాన్ లు కలిసి ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని అడాప్ట్‌ చేసుకున్నారు.ఇటీవల బిగ్ బాస్ హౌస్ కి రాకముందు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది సిరి.

ఆ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి మేం ఇద్దరం కలిసి చైతూనీ అడాప్ట్‌ చేసుకున్నామని,తల్లిగా నాకు కొత్త బాధ్యత వచ్చింది అని,తల్లి అనే బాధ్యతను నేను ఆస్వాధిస్తున్నాని అని తెలిపింది.ఇక ఈ విషయం పై సోషల్ మీడియాలో సిరి, శ్రీహాన్ జంటని అభినందిస్తున్నారు నెటిజన్లు.ఇక ప్రస్తుతం బిగ్ బాడ్ హౌస్ లో సిరి తన గేమ్ ని చాలా తెలివిగా, శ్రద్ధగా ఆడుతుంది. ఇక హౌస్ లో మొదటి కెప్టెన్ గా ఎంపికై అందర్నీ ఆకట్టుకున్న ఈ అమ్మడికి బయట జనాల్లో కూడా భారీ ఫాలోయింగ్ పెరుగుతుంది.ఇక ప్రస్తుతం 16 మంది సభ్యులతో బిగ్ బాస్ హౌస్ కొనసాగుతోంది.ఇక ఈ వారం నామినేషన్స్ లో 8 మంది సభ్యులు ఉండటం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: