అడవి శేషు.. హీరోగా సరికొత్త పాత్ర లలో నటిస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.. పవర్ ఫుల్ పాత్రల్లొ నటించి మెప్పించారు.ఇప్పుడు మరో సినిమా లో నటిస్తూన్నారు.అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది.. దాదాపు అన్నీ కార్యక్రమాలను కూడా వరుసగా పూర్తీ చెస్తుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.


మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ 'హృదయమా.' అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాట ను ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళ ఇండస్ట్రీలో దుల్కర్ సాల్మన్ విడుదల చేశారు. అడివి శేష్, సయీ మంజ్రేకర్‌ల మధ్య రొమాంటిక్‌ గా ఈ 'హృదయమా' అనే పాట కొనసాగుతుంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మెలోడి ట్యూన్‌ ను అందించారు. ఇకపోతే సిధ్ శ్రీరామ్ గాత్రం హైలెట్ అయ్యింది.


సరిహద్దు లలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధం చేసే ఒక మెజర్ గా హీరో కనిపించనున్నాడు.. అతని కోసం ఎదురుచూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట సాగుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని కూడా చూపించనున్నారు. ముంబయ్ దాడి, మేజర వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతున్నారు. మహేష్ బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. సినిమా కథ గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి మన హీరో లిస్ట్ లో మరో హిట్ పడనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: