టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు,  ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను రామ్ పోతినేని అందుకున్నాడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

 ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.  ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను  విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, ది వారియర్ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ పోతినేని మరో క్రేజీ సినిమాను లైన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  అసలు విషయానికి వస్తే.. అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను అఖండ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి,  అయితే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ టు పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.  పుష్ప పార్ట్ టు సినిమా పనులు అన్నీ ముగియడానికి ఇంకా చాలా కాలం పడుతుంది, అందువలన అంతలోపు వేరే ఒక సినిమాను తీయాలని డిసైడ్ అయిన బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితం కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: