పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కు ఉన్న స్టార్ డం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో పాన్ ఇండియా సినిమాలను తీసుకు వచ్చిన ఘనత ఈ హీరోదే.  ఆ విధంగా ప్రభాస్ ప్రేక్షకులను అలరించే విధమైన సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ఆయన ప్రణాళిక చేసుకున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రభాస్ తదుపరి చేయబోయే సినిమాల గురించి అంతటా చర్చ జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు సైతం ఆయన చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మారుతి దర్శకత్వంలో డీలక్స్ రాజా అనే ఓ సినిమాను కేవలం రెండు నెలల సమయంలోనే పూర్తి చేయనున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా హీరో ఇంత చిన్న సినిమాలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అన్ని రకాల పాత్రలను చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.  అందుకే ఈ చిత్రాన్ని ఆయన చేయడానికి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను ఎంపిక చేసే విధంగా చిత్రబృందం అడుగులు వేస్తుంది. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా పెట్టుకొదంటూ కొంత మంది ముద్దుగుమ్మలు చిత్ర నిర్మాణ సంస్థకు మరియు దర్శకుడు మారుతికి సిఫార్సు చేస్తున్నారట. దాంతో అందరికీ ప్రభాస్ కావాలంటే ఎలా అని వారు చెబుతున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాలో హీరోయిన్లు కూడా ఆ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆదిపురుష్ లో దీపికా పడుకొనే నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: