సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైనా హిట్ అనేది  ఎంత ఆనందాన్ని తీసుకు వస్తుందో , ప్లాప్ అనేది అంతే బాధ ను తెలుసు వస్తుంది.  హిట్  వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైనా క్రేజ్ అమాంతం పెరిగి పోతూ ఉంటుంది,  అదే ప్లాప్ వచ్చినప్పుడు ఆ సినిమాలో ఉన్న వారికి ఎంతో కొంత శాతం క్రేజ్ తగ్గుతుంది,  అలాగే సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల విషయంలో కూడా విజయం అనేది ఎంతో ముఖ్యం, హీరోయిన్ లకు సినిమా హిట్ అయినట్లయితే ఆ సినిమా ఆ ముద్దుగుమ్మలకు ఎంతో గుర్తింపు ను తీసుకు వస్తుంది, అదే సినిమా ప్లాప్ అయితే హీరోయిన్ లకు అదే రేంజ్ లో డ్యామేజీ కూడా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఛలో తోనే మంచి విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర  అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి.  

అయితే మధ్యలో విడుదలైన దేవ్ దాస్ ,  డియర్ కామ్రేడ్ మూవీ లను మినహాయిస్తే పుష్ప  సినిమా వరకు ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అన్ని విజయాలే దక్కాయి, రష్మీక మందన పుష్ప  సినిమాతో ఏకంగా పాన్  ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది,  ఇలా పుష్ప సినిమాతో అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన ఆ తర్వాత మాత్రం పుష్ప తెచ్చిన విజయాన్ని కంటిన్యూ చేయలేకపోయింది.  పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల అయ్యింది,  శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రష్మిక మందన కు బాక్స్ ఆఫీస్  దగ్గర ప్లాప్ ను తీసుకువచ్చింది.  ఇలా పుష్ప సినిమా తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ తో రష్మీక మందన బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: