లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతి చోట నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది .

సినిమా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 400 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర బీభత్సాన్ని సృష్టించింది.  అలాగే ఈ సినిమా కేవలం ఇండియా లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి అదిరిపోయే రేర్ మార్క్ కలెక్షన్ లను టచ్ చేసింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఈ రోజు నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పటికే థియేటర్ లలో  ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్న విక్రమ్ సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.  ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: