ఇక గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ `రాజా డీలక్స్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ కామెడీ దర్శకుడు మారుతి ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతోందని వార్తలు వినిపించడం తెలిసిందే.ఇక కామెడీ అంశాల నేపథ్యంలో సాగే హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని ఈ మూవీ కథ మొత్తం ఓ థియేటర్లో జరుగుతుందని ఇక దాని పేరు రాజా డీలక్స్ అని ఆ కారణంగానే ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే టైటిల్ ని ఫైనల్ చేశారన్నది తెలిసిందే.అయితే డైరెక్టర్ మారుతి తాజాగా తెరకెక్కించిన `పక్కా కమర్షియల్` మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీని కామెడీ ప్రధానంగా సాగే కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందించడం జరిగింది. ఇక సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై అటు మారుతి ఇటు హీరో గోపీచంద్ చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం వారిని చాలా తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఇంతకీ ప్రభాస్ - మారుతి ఫిల్మ్ వుందా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.


ఇక `పక్కా కమర్షియల్` ఫలితం తరువాత ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని ఇది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్సే లేదనే గుస గుసలు కూడా వినిపించాయి. కానీ యువీ క్రియేషన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో వున్నట్టు సమాచారం.రెబల్ స్టార్ ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే తాజాగా హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా అనుష్క, మాళవిక మోహనన్ నటించనున్నారంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాళవిక మోహనన్ .. మారుతి ఇంకా ప్రభాస్ ప్రాజెక్ట్ లపై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందట. తెలుగులో చేయబోతున్న తొలి ప్రాజెక్ట్ గురించి అడిగితే త్వరలోనే ప్రొడ్యూసర్స్ అధికారికంగా ప్రకటిస్తారని ఆమె స్పష్టం చేసిందట.దీంతో ప్రభాస్ ఇంకా మారుతి ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం అని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: