ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు నిర్మాతల వారసులు ఇండస్ట్రీకి  హీరోలు గా పరిచయమవుతున్నారు కొంతమంది.  ఇలా హీరోగా పరిచయం అయ్యి నిలదొక్కుకొని స్టార్ హీరోగా ఎదిగితే.. మరికొంతమంది మాత్రం తక్కువ సినిమాలతోనే చివరికి ఇండస్ట్రీ లో కనుమరుగవుతున్న. ఇలా స్టార్ బాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే హీరోగా పరిచయం కాక ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు ఎంతో మంది ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు ఉన్నారు.


 ఇక అలాంటి వారిలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడు అని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అనే విషయం నమ్మడానికి కాస్త ఆశ్చర్యం గానే ఉంటుంది. విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా కూడా ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ తన కెరియర్ లో ఒకే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడట విక్టరీ వెంకటేష్. కాగా ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా తన నటనతో కంటెంట్ ఓరియంటెడ్  సినిమాలు చేస్తూ వరుసగా విజయాలు అందుకుంటూ ఉన్నారు విక్టరీ వెంకటేష్. ఒకవైపు మాస్ హీరోగా మరోవైపు ఫ్యామిలీ హీరోగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.



 ఇక ఇప్పుడు బాలీవుడ్లో ఒక సినిమాలో అతిథి పాత్రలో కూడా కనిపించేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా   ఒకే ఒక సినిమాలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ప్రేమ్ నగర్ సినిమా లో.  ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాలని వెంకటేష్ను తండ్రి రామానాయుడు అడిగారట. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే వెయ్యి  రూపాయలు ఇస్తానని రామానాయుడు వెంకటేష్ కు చెప్పారట. దీంతో వెంకటేష్ కూడా ఓకే  అన్నాడట. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేయలేదు.  కాగా కలియుగ పాండవులు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: