మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనే బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు మూవీ లలో మాత్రమే కాకుండా తమిళ , హిందీ  మూవీ లలో కూడా నటించి మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ , లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ గురించి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని కీలకమైన విషయాలను తెలియజేసింది. కమల్ హాసన్ ఈ మూవీ లో 90 ఏళ్ల వృద్ధిడి పాత్రలో నటిస్తున్నారు. దాని కోసం ఆయనకు ప్రోస్తేటిక్ మేకప్ ను వేస్తున్నారు. ఆ మేకప్ ను వేయడానికి నాలుగు ... ఐదు గంటల సమయం పడుతుంది. కమల్ హాసన్ 68 సంవత్సరాల వయసులో కూడా రోల్ టైం కంటే ముందే ఉదయం ఐదు గంటలకే చేరుకుంటారు. తద్వారా కమల్ హాసన్ ఉదయం 10 గంటల వరకు సెట్ లో ఉంటాడు అని తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2 మూవీ లోని కమల్ హాసన్ పాత్ర గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలు బాలీవుడ్ మూవీ లలో ఈ ముద్దు గుమ్మ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: