
కస్టడీ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ అటు ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఇందులో నాగచైతన్య సరికొత్త లుక్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక ఏదో తేడా కొడుతుందని కూడా నాగచైతన్య లుక్ చూసి అభిమానులు అనుకుంటున్నారట. అయితే ఇప్పుడు మరో అక్కినేని హీరో అయిన అఖిల్ నూతన సంవత్సర సందర్భంగా తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఏజెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. అయితే అఖిల్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి అని చెప్పాలి. దీంతో అన్న నటనతో కంపేర్ చేస్తే తమ్ముడు చాలా బెటర్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అంతేకాదు అన్న నాగచైతన్యతో కంపేర్ చేసి చూస్తే అఖిల్ బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయింది అంటూ సినీ విశ్లేషకులు అనుకుంటున్నారట. ఇలా నాగచైతన్య కస్టడీ సినిమాతో కంపేర్ చేసి చూస్తే అఖిల్ ఏజెంట్ 100 కంటే ఎక్కువ పర్సెంట్ బెటర్ అన్న టాక్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో నాగచైతన్య కస్టడీ కంటే అఖిల్ ఏజెంట్ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా అన్నదమ్ముల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది అన్నది తెలుస్తుంది.