తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన సినిమాలు ఉన్నాయి. అందులో భాగంగా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీ లు ఏవో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా ఆలియా భట్ , ఓలీబియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16.10 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.55 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా , రవితేజ ఈ మూవీలో కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.66 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.45 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.20 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: