నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అందాల ముద్దుcగుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తాజాగా వీర సింహా రెడ్డి అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా , ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి  12 వ తేదీన సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ ఇప్పటి వరకు విజయవంతంగా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

11 రోజులకు గాను ఈ మూవీ కి నైజాం ఏరియాలో 16.60 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  సీడెడ్ లో 16.06 కోట్లు , యు ఏ లో 7.34 కోట్లు , ఈస్ట్ లో 5.49 కోట్లు ,  వేస్ట్ లో 4.12 కోట్లు ,  గుంటూరు లో 6.29 కోట్లు.  కృష్ణ లో 4.62 కోట్లు ,  నెల్లూరు లో 2.82 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ మూవీ కి 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 63.39 కోట్ల షేర్ , 102.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.
ఈ సినిమాకు 11 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.75 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  ఓవర్సీస్ లో 5.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.


మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 73.84 కోట్ల షేర్ , 124.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: