ప్రస్తుత కాలంలో చాలా సినిమాలు కూడా చాలా దారుణంగా డిజాస్టర్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కథలు బాగున్నా కూడా కొన్ని సినిమాలు చాలా దారుణంగా ప్లాప్ అవుతున్నాయి.ఇక మంచు విష్ణు చేసిన జిన్నా భాయ్ హాట్ హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ తో ఎంటర్టైన్మెంట్ బాగా వున్నా కూడా దారుణంగా ప్లాప్ అయింది.ఇంకా అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తీసిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు కూడా చాలా దారుణంగా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా ఆచార్యకి అయితే చివరికి థియేటర్ మెయింటనెన్స్ ఖర్చులకు కూడా డబ్బులు రానీ షోలు పడ్డాయి. అలాగే ఆ మధ్య నటసింహం బాలకృష్ణ తీసిన మహా నాయకుడు ఇంకా అలాగే మంచు మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాలు కూడా ఇలాగే డిజాస్టర్ బాట పట్టాయి.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ తీసిన ధాకడ్ సినిమా పరిస్థితి కూడా దారుణంగా ప్లాప్ అయింది.అయితే మలయాళం లో సినిమాలు కాస్త భిన్నంగా ఉంటాయి ప్లస్ మినిమం హిట్ అవుతాయి అనే టాక్ ఎప్పటినుంచో ఉంది.


పైగా మన తెలుగు హీరోలు  కూడా మలయాళ సినిమాలను టాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక మలయాళం లో మోహన్ లాల్ ఒక పెద్ద స్టార్ హీరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అలవోకగా 100 కోట్ల వసూళ్లు రాబడతాయి. అంత సత్తా ఉన్న హీరో మోహన్ లాల్. అయితే ఇంత పెద్ద స్టార్ హీరో కూడా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద చాలా ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాడు. ప్రస్తుతం అలోన్ అనే ఒక కొత్త సినిమా చేసి అట్టర్ ప్లాప్ తో రికార్డు సృష్టించాడు మోహన్ లాల్. మొదటి రోజు చాలా దారుణంగా 40 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు ఇంకా దారుణంగా 8 లక్షలు వసూలు చేసి టోటల్ గా ఇప్పటిదాకా కేవలం 70 లక్షల మాత్రమే వసూళ్లు చేయగలిగి చెత్త రికార్డుని నెలకొల్పింది. పైగా మోహన్ లాల్ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ కి ఈ స్థాయిలో వసూళ్లు రావడం నిజంగా సిగ్గు చేటు అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: