సినీ ఇండస్ట్రీలో ఖైదీ మరియు మాస్టర్ విక్రమ్ వంటి సినిమాలతో దర్శకుడు అతని కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాటిక్ యూనివర్సల్ నేపద్యంలో మరో క్రేజీ ప్రాజెక్టుకు బుధవారం శ్రీకారం పట్టడం జరిగింది. తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దళపతి 67 సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డాడు. కాగా ఈ సినిమా సెవెన్ స్క్రీన్స్ బ్యానర్ పై లలిత కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ అభిమానులు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఇది.

 కాగా ఈ ప్రాజెక్టుని తాజాగా లాంఛనంగా చెన్నైలో ప్రారంభించడం జరిగింది. లోకేష్ కనకరాజు మరియు విజయ్ తలపతి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో సంజీవ్ దత్త కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు ఈ సినిమాలో మిగతా కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రియా ఆనంద్ మిస్కిన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మన్సూర్ అలీ ఖాన్ వంటి వారు నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపు త్రిష విజయ్ తో కలిసి దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత నటిస్తోంది. 2008లో వచ్చిన కురివి అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన జరిగింది.

సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్ల తర్వాత దళపతి 67 సినిమాలో విరుద్దరూ కలిసి నటించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు విక్రమ్ మూవీ యూనివర్స్ లో ఖైదీని ఎంటర్ చేసిన లోకేష్ ఈ సినిమాలో కమల్ ని విక్రమ్ ని ఎంటర్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దీనికోసం కమల్ ని గెస్ట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు లోకేష్.విక్రమ్ సినిమాలో సూర్యని రోలెక్స్ గా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచిన లోకేష్ ఇప్పుడు తలపతి 67 సినిమాలో కూడా అదే తరహాలో సర్ప్రైజ్ని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే లోకేష్ ఈ సినిమాలో విక్రమ్ గా కమల్ ని ఎంటర్ చేస్తాడు అని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: