అక్కినేని నాగార్జున రెండవ కొడుకు అఖిల్ అక్కినేని సినిమా ప్రయాణంలో ఇంకా చెప్పుకునే సాలిడ్ హిట్ అందుకోలేదు. ఇప్పటి వరకు తాను చేసింది నాలుగు సినిమాలు అయినప్పటికీ ఒక్క మోస్ట్ ఎలిజిబిల్ బాచిలర్ మినహా మరే సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అయితే మొదటి సినిమాతోనే మాస్ హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా విఫలం అయ్యాడు. ఆ తర్వాత డీసెంట్ కుర్రాడిగా నటించినా కుదరలేదు. అందుకే మళ్ళీ మాస్ అవతారాన్ని ఎత్తి మన ముందుకు రానున్నాడు. స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు థియేటర్ లో కట్టిపడేసే దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఈ సినిమా గత రెండు సంవత్సరాల ముందే షూటింగ్ ను స్టార్ట్ చేసుకోగా ఇప్పటికీ పూర్తి కాలేదన్నది వాస్తవం. అయితే మొత్తానికి ఈ రోజు కాసేపటి క్రితమే విడుదల చేసిన చిన్న గింప్స్ ద్వారా రిలీజ్ తేదీని ప్రకటించి అఖిల్ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఈ గ్లిమ్స్ లో అఖిల్ మరీ వైల్డ్ గా కనిపించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇప్పటి వరకు డైరెక్టర్ రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ కానీ, టీజర్ లు కానీ,పోస్టర్ లు కానీ అన్నీ కూడా అఖిల్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేయడానికి చేస్తున్నది అని క్లియర్ గా అర్ధమవుతోంది. ఈ గ్లిమ్ప్స్ చూసిన కొందరు విజయదేవరకొండ లైగర్ తో పోల్చి చూస్తున్నారు.

పూరి జగన్నాధ్ కూడా విజయ్ ను ఎలివేట్ చేయడానికి మాస్ టీజర్ మరియు పోస్టర్ లను విడుదల చేసి పూర్తిగా దెబ్బ అయిపోయాడని , ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీ ని కూడా అలాగే చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఏజెంట్ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని.. సురేందర్ రెడ్డిపై మాకు పూర్తి నమ్మకం ఉందని అఖిల్ కెరీర్ లోనే ఇది బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అక్కినేని అభిమానుల నమ్మకం గెలుస్తుందా తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వేచి చూడాల్సిందే.      

మరింత సమాచారం తెలుసుకోండి: