ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా టాలీవుడ్ వైపే చూస్తుంది. మన సినిమాలు ఇప్పుడు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమాలను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు పరభాష హీరోలు. తాజాగా బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కూడా టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని వార్త వినిపిస్తోంది. ఈ మధ్య ప్రభాస్, హృతిక్ రోషన్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారని వార్త హల్ చల్ చేసింది. ఆ మూవీకి పఠాన్ ఫేమ్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని వార్తలు కూడా వచ్చాయి. పైగా స్వయంగా ఈ వార్తలు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ చెయ్యడంతో సోషల్ మీడియాలో ఓ రేంజిలో హల్ చల్ చేశాయి ఈ వార్తలు.


ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయనున్నారని తెలుస్తోంది.టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో ఒక చేయడానికి రెడీ అవుతున్నారు అని సమాచారం తెలుస్తోంది. తెలుగు దర్శకుడితో ఈ మూవీ చేయనున్నారని టాక్. ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని ఇంకా అలాగే మైత్రీ మూవీ మేకర్స్ హృతిక్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ స్పాట్ కు వెళ్లిన హరీష్, గోపీచంద్ ఇంకా మైత్రీ మూవీ మేకర్స్ హృతిక్ తో కలిసి ఫోటో దిగారు. స్టోరీ సిట్టింగ్ కోసం వీరు హృతిక్ రోషన్ ని కలిసినట్లుగా సమాచారం వినిపిస్తుంది. అయితే హృతిక్ రోషన్ తో గోపీచంద్ మలినేని ఇంకా హరీష్ శంకర్ ఈ ఇద్దరిలో ఎవరు సినిమా చేస్తారన్నది ఇప్పుడు నెట్టింటా ఆసక్తికరంగా మారింది. మరి త్వరలోనే దీని పై అధికారికంగా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: