
ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ నట విశ్వరూపాన్ని చూపించాడు అంటూ ప్రస్తుతం విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక తమకు షారుక్ ఖాన్ నుంచి ఎలాంటి సినిమా అయితే కావాలని కోరుకున్నామో అలాంటి సినిమానే ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని అభిమానులు కూడా ఈ సినిమాతో సంతృప్తి చెందుతూ ఉన్నారు. ఇక ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ హవా మళ్లీ మొదలైంది అంటూ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఒక చిన్నారి మాత్రం తనకు పఠాన్ సినిమా నచ్చలేదు అంటూ చెప్పింది.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా హల్చల్ చేస్తుంది అని చెప్పాలి. అభిషేక్ కుమార్ అనే ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. అహనా.. నువ్వు ఇప్పుడు ఏ సినిమా చూసి వచ్చావు అంటూ అభిషేక్ చిన్నారిని ప్రశ్నించాడు. ఆ చిన్నారి ఎంతో క్యూట్‌గా పఠాన్ సినిమా చూశాను అంటూ చెబుతుంది. అయితే ఈ సినిమా నీకు నచ్చిందా అని అడిగితే నచ్చలేదు అంటూ ఆ చిన్నారి సమాధానం చెబుతుంది. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారగా ఇక షారుఖ్ ఖాన్ దృష్టిలో కూడా పడింది. దీనిపై స్పందించిన షారుక్ ఓహో.. ఇప్పుడు నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి.. చిన్నారి ప్రేక్షకులను అస్సలు నిరాశపరచొద్దు అంటూ రిప్లై ఇచ్చాడు.