విలక్షణ నటుడు జగపతిబాబు సినిమాలలో ఎలాంటి పాత్రని అయినా నటించి మెప్పిస్తాడు కానీ నిజ జీవితంలో తనకు నటించడం రాదు అని తరుచూ చెపుతూ ఉంటాడు. తన మనసులోని మాటలను చాల స్పష్టంగా ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పడం అతడి అలవాటు.


గతంలో అతడి కూతురు ఒక విదేశస్థుడుని పెళ్ళి చేసుకున్న సందర్భంలో కొందరు ఎన్నారై కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు జగపతిబాబుతో అదోవిధంగా స్పందించినప్పుడు జగపతి బాబు వారిని వేస్ట్ ఫెలోస్ అన్నట్లుగా స్వయంగా జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు తన కుటుంబానికి లేని అభ్యంతరం వేరే వాళ్లకు ఏమిటనీ జగపతి బాబు సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.


అంతేకాదు తాను కుల పిచ్చికి వ్యతిరేకమని ఇంట్లో పనిచేసేవాళ్ళు వేరే కులస్థులు అయితే పనికివస్తారు కాని పెళ్ళికి మాత్రం వేరే కులస్థులు పనికిరార అంటూ అప్పట్లో చాల ఘాటుగా జగపతి బాబు స్పందించాడు. ఇక ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు సమాజంలో పెరిగిపోతున్న కుల పిచ్చి పై ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.


తాను ఆమధ్య విజయవాడ సిద్దార్థ్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు తాను ఆవేదిక పై కులానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతానని తాను చెప్పినప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆడిటోరియంలో 2 వేల మంది కుర్రాళ్లు ఉన్నారని వారిలో చాలామంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని ఆ కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే రచ్చరచ్చ చేస్తారని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే తాను ఒక కులానికి చెందిన వాడిని కాదు అని చెపుతూ తనకు కుల పిచ్చి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. వాస్తవానికి సినిమా రంగంలో రాజకీయాలలో పారిశ్రామిక రంగంలో కులం నీడలా ప్రతివాడినీ వెంటాడుతూనే ఉంటుంది. జగపతి బాబు కలలు కనే కుల రహిత సమాజం రావడానికి మరికొంత కాలం పట్టే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: