శంకర్ పనితీరుకి టెన్షన్ పడుతున్న RC, కమల్ ఫ్యాన్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చాలా స్పీడ్ గా సాగుతున్నాయి, ఇదే సమయంలో శంకర్ ఇంకోవైపు తమిళ చిత్రం విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుత కాలంలో దర్శకులు ఒకేసారి రెండు సినిమాలను చేయడం మనం చాలా అంటే చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు దర్శకులు ఒకేసారి ఏకంగా నాలుగైదు సినిమాలను చేశారు, కానీ ఇప్పుడు మాత్రం దర్శకులు  ఒకే సినిమాను చేస్తున్నారు.అయితే శంకర్ కి గతంలోని ఇండియన్ 2 సినిమా ఒప్పందం అనేది జరిగింది. 


కానీ కొన్ని విపత్కర కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ సినిమాను మొదలు పెట్టాడు.ఇక రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఇండియన్ 2 సినిమాని కూడా పూర్తి చేయాలని మధ్యవర్తులు రాజీ పడ్డారు.దాంతో రెండు సినిమాలను కూడా శంకర్ ఇప్పుడు ఒకే సమయంలో చేస్తున్నాడు. మొన్నటి దాకా రామ్ చరణ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. అయితే తాజాగా ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు. మొత్తానికి శంకర్ ఒకేసారి ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఈ రెండు పడవలను జాగ్రత్తగా శంకర్ ఒడ్డుకి తీసుకెళ్తాడా? లేదా? అంటూ కమల్ హాసన్ ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.చూడాలి మరి ఏ రెండు సినిమాలు విడుదల అయ్యి ఎలాంటి హిట్లని నమోదు చేస్తాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి: