
మన దేశంలో సినిమా రంగానికి ఎంతో క్రేజ్ ఉంది. అటు నార్త్ లో పెద్ద సినిమా పరిశ్రమ అయిన బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లో తెలుగు , తమిళం , కన్నడం , మళయాళం భాషల్లో ప్రాంతీయ సినీ పరిశ్రమలు కూడా మంచి మంచి సినిమాలు తీస్తున్నాయి. ఉదాహరణకు మళయాళ సినీ ఇండస్ట్రీ చిన్న పరిశ్రమే అయినా అక్కడ సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్‌ను తలదన్నేసి ప్రపంచ సినీ పరిశ్రమకు పోటీ ఇచ్చేలా పరుగులు పెడుతుంది. ఒకప్పుడు మన హైదరాబాద్ లో ప్రసాద్ ఐమ్యాక్స్‌లోనే దేశంలోనే పెద్దది అయిన సినిమా తెర ఉండేది. ఇప్పుడు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా థియేటర్ మన ఇండియాలో రాబోతోంది.
వేవ్స్ సమ్మిట్ 2025లో భారతీయ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలపై చర్చలు జరుగుతుండడంతో పాటు ఇక్కడ అనేక కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే, తాజాగా ఈ వేదికపై మరో చారిత్రాత్మక విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా వెల్లడించాయి. నాగ్‌పూర్ లో త్వరలోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు ఈ రెండు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. ప్రపంచానికి ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్‌గా భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో వీరు ఈ సంచలన నిర్ణయం ఎనౌన్స్ చేశారు. ఈ ప్రకటనను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో రెండు సంస్థల నిర్మాతలు చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు