
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలలో ముందుగా రిలీజ్ అయ్యే సినిమా ‘ హరిహర వీరమల్లు ’ . ఈ సినిమా తర్వాత ఓజీ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ఉంటుంది. ఇక వీరమల్లు సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. ఈ సినిమా ను సీనియర్ నిర్మాత ఏఎం. రత్నం తనయుడు ఏఎం. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హిస్టారికల్ సినిమాగా ఈ సినిమా రానుంది. ఇక వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో ఫ్యాన్స్ బాగా నిరాశలో ఉన్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీరమల్లు సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నాడట. పవన్ అటు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో సినిమాలకు టైం కేటాయించలేని పరిస్థితి. ఇక ఈ సినిమా షటింగ్ లో మే 4 నుంచి జాయిన్ కాబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్. పవన్ తన బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేస్తే ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. వీరమల్లు సినిమా లో పవన్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు