- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియ‌స్ సినిమా ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న కింగ్‌డ‌మ్ సినిమా ఒక‌టి. ఈ సినిమా కు జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ను స్పై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో కింగ్‌డ‌మ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఇచ్చేశారు. కింగ్ డ‌మ్‌ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ త‌న‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాను తాను 40 శాతం చూశానని.. ఇప్పటికే సినిమా తనకు పిచ్చపిచ్చగా నచ్చేసిందని తెలిపాడు. కింగ్ డ‌మ్ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన తెలిపాడు.


ఇప్ప‌ట‌కీ స‌గం సినిమా మాత్ర‌మే బీజీఎం చేసిన అనిరుధ్ ఇలా సినిమా పై సూప‌ర్ కాన్ఫిడెంట్ గా ఉండ‌డంతో ఈ మూవీ పై మేక‌ర్స్ ధీమాగా ఉన్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా తో త‌న అంద చందాల‌తో ఊపేసిన భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 30 న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. కింగ్‌డ‌మ్ బిజినెస్ వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీగా జ‌రుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: