
దీంతో అతి తక్కువ సమయంలో ఎలిమినేట్ కావడం జరిగింది నైనిక. ముఖ్యంగా టాస్కుల్లో యాక్టివ్ గా లేకపోవడం పర్ఫామెన్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో మూడు వారాలకే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. అలా హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పలు రకాల టీవీ షోలలో కనిపించిన నైనిక యూట్యూబ్లో కూడా తరచూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే తాను ఒక కొత్త కారు కొనుగోలు చేశానంటూ తెలియజేస్తోంది నైనిక. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.
తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని తన కుటుంబం తనను చూసి చాలా గర్వపడుతోందని.. అలా గర్వపడేలా చేసింది మీరే అంటూ తమ అభిమానులకు సపోర్ట్ చేసేవారికి కృతజ్ఞతలు అంటూ తెలియజేసింది నైనిక. ప్రస్తుతం నైనిక కొత్త కారుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు సెలబ్రిటీల స్నేహితుల సైతం అభినందనలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నైనిక కొన్న కారు ధర 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ అందుకొని పలు సీరియల్స్ లో నటించాలని కోరుకుంటున్నారు అభిమానులు.