టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  చేసిన సినిమాల్లో అట్టర్ ప్లాప్ అయిన సినిమాల్లో జానీ కూడా ముందు వరుసలో ఉంటుంది. 2003 సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించడం జరిగింది.గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై స్వయాన తన బంధువు అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. అప్పటికే పవన్‌ కళ్యాణ్ తో డీప్ లవ్‌లో ఉన్న రేణుదేశాయ్ పవన్‌కు జోడీగా నటించడం జరిగింది. రమణ గోగుల ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ని అందించారు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా దారుణమైన టాక్ తో అట్టర్ ప్లాప్ అయ్యింది.ఈ సినిమాని ఖుషి తర్వాత ఏకంగా రెండేళ్ల గ్యాప్ తీసుకుని మరీ పవన్ చాలా కాన్ఫిడెంట్ గా చేశాడు. ఖుషీ సూపర్ హిట్ అయ్యింది.ఇంకా యూత్‌ను ఎంతగానో మెస్మరైజ్ చేసేసింది.


సినిమా సూపర్ హిట్ అయ్యాక పవన్‌ కళ్యాణ్ కి యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. పైగా పవన్ సొంత డైరెక్షన్ అంటే సినిమా మామూలుగా ఉండదనుకున్నారు. కానీ థియేటర్ కి వెళ్ళాకా చాలా నీరసమైన గెటప్‌తో పవన్‌ను చూసిన ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు.ఇక ఈ సినిమాపై టాలీవుడ్ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీ సినిమా మంచి స్టోరీ లైన్ అని.. అయితే ఆ సినిమాను పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరైన ఓ చిన్న హీరోతో చేసి ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేదని చెప్పారు.పవన్ కళ్యాణ్‌కు అసలు ఈ సినిమా సెట్ కాలేదు. అప్పటికి ఆయన క్రేజ్ పీక్స్ లో ఉంది. అదే వేరే హీరోతో చేసి ఉంటే ఖచ్చితంగా జానీ సినిమా మంచి హిట్ అయ్యేదని ఆయన చెప్పారు. ఇక పవన్ ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారని కూడా విజయేంద్రప్రసాద్ ఎంతగానో మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: