ఇండియాలోనే అత్యంత క్రేజ్ కలిగిన అతి కొద్ది మంది దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి వాటితో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం ఇండియా లోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. దర్శకుడు శంకర్ ఆఖరుగా రోబో 2.0 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

రజినీ కాంత్ హీరో గా రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ల పరంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించినప్పటికీ రోబో సినిమాతో పోలిస్తే మాత్రం అంతటి రేంజ్ విజయాన్ని సాధించలేదు. ఇది ఇలా ఉంటే రజినీ కాంత్ చాలా రోజుల క్రితమే కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఆగిపోయింది. అలా ఇండియన్ 2 సినిమా ఆగిపోవడంతో శంకర్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో ఒక మూవీ ని స్టార్ట్ చేశాడు.

ఆ తర్వాత ఇండియన్ 2 మూవీ ని కూడా శంకర్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ లను శంకర్ పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాలను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రెండు సినిమాలకు శంకర్ దర్శకత్వం వహించిన కారణంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ రెండు మూవీ లలో ఏదో ఒక సినిమాను సంక్రాంతి కానుకగా కచ్చితంగా విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: