
తీపి కోసం పంచదార లేదా బెల్లం వేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఇలా తయారు చేసుకుని తాగితే వేసవికాలంలో ఎండ బారి నుంచి బయటపడవచ్చు. వేసవిలో బేల్ షర్బత్ తాగడం కూడా చాలా మంచిది. బేల్ పండ్లను మధ్యలో కోసి గుజ్జు తీయండి. దాంట్లో పంచదార, చల్లటి నీరు, ఐస్ కలిపి జ్యూస్ తయారు చేయండి. ఇది శరీరానికి చలవ చేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. గులాబీ షర్బత్ రేఖలను నూరి లేదా మార్కెట్లో దొరికే గులాబీ సిరప్ తో గులాబీ షర్బత్ తయారు చేసుకోవచ్చు. ఇది శరీరానికి చలవని ఇస్తుంది. వేసవిలో ఫ్రెష్ గా అనిపిస్తుంది. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
సత్తు షర్బత్ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా చలవయిస్తుంది. సత్తు పొడిలో నిమ్మరసం, నల్ల ఉప్పు, సదా ఉప్పు, చాట్ మసాలా కలిపి నీళ్లు పోయాలి. ఐస్ వేసి డ్రింక్ తయారు చేయండి. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచుతుంది. వేసవిలో రోజుకో గ్లాస్ కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో తయారుచేసిన మజ్జిగ వేసవిలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, చల్లబరచడానికి సహాయపడుతుంది. మజ్జిగ తయారు చేయడానికి పెరుగును బాగా చిలికి, దానిలో నీళ్లు కలపండి. పైన నల్ల ఉప్పు, మిరియాల పొడి, జీరాపొడి వేసి తీసుకోండి. రుచి అదిరిపోవటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.