
ఐకన్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క నటించిన వేదం, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే, ఖలేజా సినిమాలు, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో, గోపీచంద్ గౌతమ్ నంద, జూనియర్ నందమూరి తారక రామరావ్ నటించిన ఊసరవెల్లి, రామ్ నటించిన జగడం సినిమా, హీరో అక్కినేని నాగచైతన్య తెరకెక్కించిన జోష్ సినిమాలు కూడా ఫ్లాప్ అయినప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాయి. కొత్త సినిమాలతో సమానంగా రీరిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది.
ఈ క్రమంలో త్వరలో మరో మంచి బ్లాక్ బస్టర్ సినిమా రీరిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఆ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా. అదేనండీ మన మెగా స్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. ఈ సినిమాకి నెటిజన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమాని 90s నుండి నేటి వరకు చూస్తూ ఉంటారు. ఈ మూవీ మరోసారి రీరిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనుంది. ఈ సినిమా త్వరలో రీరిలీజ్ అవ్వనుంది. ఈ మూవీ మే 9వ తేదీన థియేటర్ లో విడుదల అయ్యి సందడి చేయనుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.