
నిజానికి బన్నీ..పుష్ప సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ ఆ సినిమాని పక్కన పెట్టేసి మరి అల్లు అర్జున్.. పుష్ప లాంటి బిగ్ హిట్ తర్వాత అలాంటి ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తేనే అల్లు అర్జున్ కి కెరియర్ ఉంటుంది అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సైతం అట్లీ సినిమా బన్నీ కమిట్ అయ్యేఅలా చేశాడు. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ - అట్లీ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ జబ్బు మనిషి గల క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట అట్లీ .
ఇది నిజంగా అట్లీ చేస్తున్న ఒక్క బిగ్ రిస్కీ పని అంటున్నారు అభిమానులు. పుష్ప సినిమా వేరు . అది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ . ఆ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించిన జనాలు లైక్ చేస్తారు . పైగా కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఇప్పుడు కూడా మళ్లీ అదే విధంగా బన్నీని చూపించాలి అనుకుంటే అది నిజంగా అట్లీ చేసిన బిగ్ రాంగ్ స్టెప్ అని అంటున్నారు జనాలు . అట్లీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ సజెషన్స్ చేస్తున్నారు . చూద్దాం మరి అట్లీ ఏం చేస్తాడు..? అల్లు అర్జున్ పై రాసుకున్న సీన్స్ ఎలా మారుస్తాడు అనేది..???