తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత  మూడవసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ పాలన చేపట్టే సమయానికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అప్పులే తప్ప మిగులు బడ్జెట్ ఏమీ లేదు. అదే రాష్ట్రం కొత్తగా ఏర్పడే సమయంలో 60 వేల కోట్ల బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అలా లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్లారు కేసీఆర్. అలాగని ఆయన అభివృద్ధి చేయలేదని కాదు. కాలేశ్వరం, 24 గంటల కరెంటు, కల్యాణ లక్ష్మి, వంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చి పేద ప్రజలకు బాసట అందించారు.. ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతులకు ఆసరాగా నిలిచారు. ఇవన్నీ బాగానే ఉన్నా  చాలామంది ప్రజలను సోమరులుగా మార్చిన ఘనత కూడా ఆ ప్రభుత్వానికే దక్కిందని చెప్పవచ్చు.. దేశ భవిష్యత్తును కాపాడేది యువత అంటారు. అలాంటి యువతకు తెలంగాణ రాష్ట్రంలో బాసట ఇవ్వకుండా 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు, ఇతర విషయాల్లో బాసట కల్పించి వారిని ముందుకు తీసుకొచ్చారు కేసీఆర్. చదువుకున్న యువతను పూర్తిస్థాయిలో వెనక్కి తోక్కేసి కనీసం వారికి ఎలాంటి న్యాయం కూడా చేయలేదు. 

ముఖ్యంగా ఉద్యోగాలు  అందించడంలో  చాలా వెనుకబడి పోయారని చెప్పవచ్చు. తరచూ ఉచితాలు ప్రకటిస్తూ, ప్రభుత్వ ధనాన్ని అంతా ప్రజల్లోకి పంచి కేసీఆర్ ఒక దేవుడయ్యారని చాలామంది మేధావులు భావిస్తున్నారు. అలా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయిందో, అదే విధంగా భవిష్యత్తులో బ్రతికే యువత చాలా వరకు వెనుకబడిపోయింది. ఎక్కువగా ముసలి వాళ్ళను, మధ్య వయసులో ఉన్న వాళ్లను మాత్రమే తన వైపు తిప్పుకొని వాళ్లే దేశానికి భవిష్యత్తు అనే విధంగా తయారు చేశాడు. దేశ భవిష్యత్తును కాపాడే యువతను వెనకబడేశాడు. దీనివల్ల అప్పటికప్పుడు కేసీఆర్ దేవుడు అవుతాడు కానీ, భవిష్యత్తు తరాలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు.. అంతేకాకుండా 10 సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిలో అప్పులు తెచ్చి, సామాన్య మానవులపై ఆ భారం పడేలా చేశాడని చెప్పవచ్చు.. కట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వీళ్లకు ఎటు చూసినా అప్పులు తప్ప  రాబడి లేదు.. దీనికి తోడు 420 హామీలు ఇచ్చి మేము నెరవేస్తామని గప్పలు కొట్టారు. అందులో నాలుగు హామీలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. దీనికి తోడు ఉచిత బస్సు పేద ప్రజలకు మేలు చేస్తున్న కానీ ప్రభుత్వానికి భారంగా నిలుస్తోంది.

 అంతేకాకుండా మహిళలకు 2500 ఇస్తానని మోసం చేశారు. మరి ముఖ్యంగా పింఛన్లను 4వేలు ఉంటే 6వేలు, 2000 ఉంటే 4 వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇదే కాకుండా కల్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అమలు మరిచాడు. దీనికి తోడు ఎకరానికి 15 రైతుబంధు, ఏకకాలంలో రుణమాఫీ  ఇలా లెక్కలేనన్ని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం విఫలం అవ్వడంతో  ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాస్త విసిగి వస్తోంది. కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రోగ్రాం మొదలుపెట్టిన తప్పనిసరిగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం బడ్జెట్ ను బట్టి పథకాలు అమలు చేస్తూ నిజమైన పేదలకు మాత్రమే పథకాలు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ  ఉద్యోగ నియామకాలు కూడా అందిస్తోంది.

ఇలా ముందుగా యువత డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, ఉచితలకు అలవాటుపడ్డ కొందరు  కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఎక్కువ హామీలు ఇచ్చి నెరవేర్చడంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు. వీళ్ళిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అంటే దేశ బడ్జెట్ మొత్తం పెట్టిన  సరిపోదని ఆర్థిక మేధావులు అంటున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసుకునే బ్రతికే వారు తక్కువైపోయి, ఏ పని కావాలన్నా ఇతర రాష్ట్రాల వారిపై ఆధారపడే పరిస్థితులు వస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో  ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక మేధావులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: