
ఇంపాక్ట్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ సహా మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్ ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. పొరపాటున ఐపీఎల్ లో మరోసారి స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడితే పంత్ పై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. రూ.90 లక్షల ఫైన్ తో పాటు డీమెరిట్ పాయింట్లు కూడా యాడ్ చేస్తారు. ఈ డీమెరిట్ పాయింట్లు లెక్క దాటితే ఓ మ్యాచ్ సస్పెన్షన్ పడుతుంది. ఇకపోతే రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన రిషబ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఈ ఐపీఎల్ 2025లో 10 మ్యాచ్ ల్లో పంత్ 110 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో పంత్ 4 రన్స్ సాధించాడు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన లక్నో 54 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ కౌన్సిల్... "కనీస ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో లక్నో జట్టు రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసింది. అందుకే పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా, ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయింగ్ ఎలెవెన్‌లోని మిగిలిన సభ్యులకు రూ. 6లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలి!" అని ఓ ప్రకటనలో ఆదేశించింది. తాజా మ్యాచ్‌లో ముంబయి జట్టు 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు కింద ఓడించిన విషయం తెలిసిందే. ఎంఐ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎల్ఎస్‌జీ 161 పరుగులకు ఆలౌట్ అయింది.