సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటి కి సంబంధించిన ఏదో ఒక టాలెంట్ ని ఎక్కువగా ట్రెండ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు.  మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరోతో కంపేర్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు ఇద్దరి హీరోలను ట్రెండ్ చేస్తున్నారు జనాలు.  ఆ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో బడా తో పైన హీరోలే కావడం ఇంట్రెస్టింగ్ మ్యాటర్.  వాళ్లు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీని తన డాన్స్ తో షేక్ చేసే జూనియర్ ఎన్టీఆర్.  ఇద్దరికీ ఇద్దరే తోపైన హీరోలు .


ప్రతి విషయంలోనూ బాగా కాంపిటేటివ్ గా ఉంటారు.  కాగా వీళ్ళిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించారు.  అయితే తారక్ కి కన్నా రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో అభిమానులకు నచ్చేసింది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అయితే చరణ్ కి ఓ టాలెంట్ అస్సలు లేదు అని జూనియర్ ఎన్టీఆర్ కి ఆ టాలెంట్ ఎక్కువగా ఉంది అంటూ అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ ఓ న్యూస్ ని బాగా ట్రెండ్ చేశారు.  మరొకసారి సోషల్ మీడియాలో అదే న్యూస్ ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది.



చరణ్ టాలెంటెడ్ హీరోనే.. బాగా నటిస్తాడు. బాగా డాన్స్ చేస్తాడు .. కానీ డైలాగ్ డెలివరీ మాత్రం అంత అనుకున్నంత స్థాయిలో ఉండదు . అది అందరికీ తెలిసిందే . స్వయాన మెగా ఫ్యాన్స్ కూడా ఆ విషయాన్ని ఒప్పేసుకుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో కెవ్వు కేక అనే అంటారు నందమూరి అభిమానులు.  కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు . సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క స్టార్ కి జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ డెలివరీ అంటే బాగా ఇష్టం . చాలా మంది ఆయన డైలాగ్ చెప్పే విధానాన్ని ఇష్టపడుతూ ఉంటారు.  అయితే రామ్ చరణ్ కి మాత్రం ఇప్పటికీ డైలాగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పడం రానే రాదు అంటూ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు . ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు కొంతమంది నందమూరి ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: