పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీజలాల ఒప్పందాన్ని భారతదేశం సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్-పాక్ సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్‌కు వదిలేది లేదంటూ దేశాధినేతలు ప్రకటించిన సంగతి కూడా విదితమే. అయితే ఎక్కడో చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లో పుట్టే సింధు నది నీటిని పాకిస్తాన్ వెళ్లకుండా పూర్తిగా ఆపడం భారత్ కి ఎలా సాధ్యం? ఆ నది, ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం? నీటి ప్రవాహం? వంటి విషయాలను ప్క్కసారి పరిశీలిస్తే?

భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్పాకిస్థాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనినే "ఇండస్ వాటర్స్ ట్రీటీ" అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ (సింధు) నదీ వ్యవస్థలోని 6 నదుల నీటిని 2 దేశాల వారు పంచుకోవాలి. తూర్పు నదులు అయినటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి నియంత్రణ ఉంది. ఇవి సుమారు 33 మిలియన్ ఎకర్-ఫీట్ నీటిని అందిస్తాయి. భారత్ ఈ నీటిని పంజాబ్, హరియాణాతో పాటు రాజస్థాన్‌లో సాగు అవసరాలకు, జలవిద్యుత్ ఉత్పత్తికి వెడుతోంది. 2019 నివేదిక ప్రకారం భారత్ తన వాటా నీటిని 95% వినియోగించుకుంది.

అలాగే పశ్చిమ నదులు అయినటువంటి సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్‌కు ఎక్కువ నియంత్రణ కలదు. ఇవి సుమారు 135 MAF నీటిని అందిస్తాయి. ఇది సింధు నది వ్యవస్థ మొత్తం నీటిలో 80%. భారత్ ఈ నదుల నీటిని పరిమితంగా, విద్యుత్ ఉత్పత్తి, నావిగేషన్, చేపల సాగు వంటి అంశాల కోసం మాత్రమే వాడుకుంటోంది. కానీ నీటి ప్రవాహాన్ని నిలిపివేయడం, నిల్వ చేయడం ఒప్పందం ప్రకారం అయితే కుదరనే కుదరని పని. ఈ ఒప్పందం 1965, 1971, 1999లో జరిగిన యుద్ధాలు మరియు ఇతర ఉద్రిక్త సమయాల్లో కూడా కొనసాగింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన నీటి పంపిణీ ఒప్పందంగా వ్యూహాత్మక నిపుణుడు బ్రహ్మ చెల్లానీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే అయితే ఈ ఒప్పందం భారత్‌కు అనుకూలంగా లేదని, దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని విడనాడే వరకు ఇండస్ వాటర్స్ ట్రీటీని “అబెయన్స్‌”లో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సి వుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: