
నాని నటించిన ‘హిట్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి ప్రత్యేక అతిథిగా హాజరైన నేపథ్యంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. రాజమౌళితో తనకున్న ప్రత్యేక సెంటిమెంటును షేర్ చేసుకున్నారు. నాని మాట్లాడుతూ.... "నా సినిమాకి విచ్చేసినందుకు ఎస్ఎస్ రాజమౌళి గారికి చాలా థాంక్స్. జక్కన్న సినిమా ఎప్పుడో డిక్షనరీలోకి వెళ్లిపోయింది. ఆయన తీసే సినిమాలు మాకు రిఫరెన్స్‌గా ఇపుడు ఉపయోగపడుతున్నాయి. అతని స్ఫూర్తితోనే ఇలాంటి సినిమాలు రూపొందుతున్నాయి. హిట్ 3 సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం వుంది. ఒకవేళ అది జరగకపోతే మహేష్ - రాజమౌళి సినిమా చూడొద్దు!" అని షరతు పెడుతూ సరదాగా నవ్వేసాడు. ఆ వెంటనే పక్కనే వున్న జక్కన్న కూడా నవ్వేసాడు."
దాంతో జక్కన్న అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ క్రమంలోనే హిట్-3 సినిమా కోసం.. రాజమౌళి మూవీని తాకట్టు పెట్టేసాడుగా! అని సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... విశ్వక్‌సేన్, అడివి శేష్.. హిట్ సిరీస్‌కి రెండు పిల్లర్స్. ఇప్పుడు దాన్ని మరో రేంజ్‌కి తీసుకెళ్లబోతున్నాం. శైలేష్ ఈజ్ మై బాయ్... అని తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. సంగీత దర్శకుడు గురించి మాట్లాడుతూ... మిక్కీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆరోగ్యం బాగోలేకపోయినా రసం అన్నం తినిపించి మరీ పనిచేయించాం. ఇక శ్రీనిధి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా కోసం మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసి అభిమానులు అనేకమంది కాల్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.