పర్యావరణ సంరక్షణ లో భాగంగానే ఇప్పుడు కాలుష్య రహిత సమాజాన్ని సృష్టించడం కోసం ..అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేయాలని భావిస్తున్నారో.. అలాంటి వారికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.. మీరు కూడా ఒకవేళ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటే ,ఈ బంపర్ ఆఫర్ ఏమిటో ఒకసారి తెలుసుకోండి..

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికోసం, రాయితీలను కూడా ప్రకటించింది.. తమ రాష్ట్రాన్ని ఎనర్జీ స్టోరేజ్  వ్యవస్థకు కేంద్ర బిందువు గా మార్చడం కోసం విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020 - 2030 ని రూపొందించడం జరిగింది. ఈ పాలసీని 2020 సంవత్సరం లోనే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది.

ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో  పెట్టుబడి పెట్టేందుకు ప్రజలను ఆకర్షించడానికి , అభివృద్ధి, పరిశోధన, తయారీకి ప్రోత్సాహం ,వాణిజ్య రంగాల్లో ఉన్న రవాణా ఖర్చులను తగ్గించడం, వ్యక్తిగత అలాగే ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా , దాదాపు పది సంవత్సరాల పాటు ఈ పాలసీ పని చేస్తుంది అని అధికారులు సూచిస్తున్నారు..

ఈ పాలసీ ద్వారా ఎవరైతే వాహనాలను కొనుగోలు చేస్తారో, వారికి తొలివిడత లో తయారయ్యేటువంటి రెండు లక్షల ద్విచక్ర వాహనాలకు, 30 వేల ఆటో రిక్షా లకు అలాగే ఐదు వేల కార్లకు అలాగే 500 ఎలక్ట్రిక్ బస్సులకు.. రోడ్డు పన్ను తో పాటు  రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా లేకుండా పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు అలాగే నిరుద్యోగులకు మరో సరికొత్త రాయితీ కూడా తీసుకొచ్చింది. ఎవరైతే వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తారో,వారికి స్వయం ఉపాధి పథకాల కింద డబ్బు సహాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విద్యుత్ ట్రాక్టర్లకు కూడా పూర్తిగా టాక్స్ లను, రిజిస్ట్రేషన్ ఫీజులను లేకుండా చేయడం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: