తాజాగా రిస్క్ లేకుండా రాబడి పొందాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం రకరకాల పెట్టుబడి పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తరఫున పోస్ట్ ఆఫీస్ లు కూడా కొన్ని రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక వీటిలో రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇందులో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం ద్వారా అనేక అదిరిపోయే బెనిఫిట్లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ఒకేసారి భారీ మొత్తం తో పాటు రిస్క్ లేని రాబడి పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పథకంపై పోస్ట్ ఆఫీస్ 6.5% వడ్డీని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కీమ్లో 100 రూపాయలు నుంచి డబ్బులు మీరు పొదుపు చేసుకోవచ్చు.  గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.  సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కూడా తెరిచే అవకాశం ఉంటుంది.  ప్రతి నెల డిపాజిట్ చేస్తే భారీ స్థాయిలో డబ్బులు పొందవచ్చు.  ఈ పథకం యొక్క నిర్ణీత కాలం ఐదు సంవత్సరాలు.. ఆ తర్వాత డబ్బులను మీరు ఒకేసారి పొందవచ్చు.

అయితే మీరు ఇన్వెస్ట్ చేసి రాబడి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నెలకు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. మెచ్యూరిటీ సమయం అంటే ఐదు సంవత్సరాల తర్వాత భారీ మొత్తం పొందవచ్చు నెలకు ₹1000 చొప్పున ఐదేళ్లకి ₹60,000 డిపాజిట్ చేస్తే వడ్డీ రూపంలో ₹11వేలు లభిస్తాయి.  అలాగే మీరు టెన్యూర్ మరో 5 ఏళ్ళు పొడిగించుకుంటే అప్పుడు మీ డిపాజిట్ ₹1.2 లక్షలు వస్తుంది. వడ్డీ రూపంలో ₹ 49000 లభిస్తే మొత్తం ₹.1.69 లక్షలు మీ చేతికి వస్తాయి. మీకు ₹.5,00,000 కావాలి అంటే 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: