బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ బ్యాంకుగా పేరు దక్కించుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ పండుగ సీజన్లో కొత్త జీవితకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను మొదలు పెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కే సంగ్ త్యోహార్ కి ఉమాంగ్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా లైట్ సేవింగ్స్ ఖాతాను జీవితకాల జీరో బ్యాలెన్స్ సౌకర్యంతో పరిచయం చేయడం గమనార్హం. దీని ద్వారా కస్టమర్లు కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఏమీ లేకుండానే .. అన్ని బ్యాంకింగ్ సేవలను కూడా పొందవచ్చు అని బ్యాంకు స్పష్టం చేసింది.


అంతేకాదు ఈ ఖాతా ద్వారా వినియోగదారులు ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డును కూడా ఎంచుకోవచ్చు అని స్పష్టం చేసింది . ఇకపోతే ఖాతాలో నామమాత్రపు త్రైమాసిక సగటు బ్యాలెన్స్ ని నిర్వహించడం చాలా ముఖ్యమని అర్హత ఉన్న ఖాతాదారులు జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డును కూడా పొందవచ్చు అని తెలిపింది. ఇకపోతే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న లైట్ సేవింగ్స్ ఖాతా యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే జీవితకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఇందులో ఖాతా తెరవచ్చు.

అంతేకాదు మెట్రో అర్బన్ బ్రాంచ్ కోసం రూ .3వేలు,  సెమీ అర్బన్ బ్రాంచ్ కోసం రూ.2000,  రూరల్ బ్రాంచ్ కోసం వెయ్యి రూపాయలు చొప్పున ఖాతాను మొదలు పెట్టవచ్చు.  ఇక ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ క్రెడిట్ కార్డులపై ఆకర్షణీమైనా ఆఫర్లను అలాగే తగ్గింపులను కూడా అందిస్తోంది. ఇక ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాల విషయానికి వస్తే.. ఫోటోతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ , పాస్పోర్ట్ , ఓటర్ గుర్తింపు కార్డు,  ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు , మున్సిపల్ లేదా ఆస్తి పన్ను రసీదు,  యుటిలిటీ బిల్లును లబ్ధిదారుల పేరు,  చిరునామా తో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా లేఖ కలిగి ఉండాలి. ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఇలా కొత్త స్కెచ్ వేసింది మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: